నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి: వైఎస్ భాస్కర్‌రెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు వైఎస్ భాస్కర్‌రెడ్డి కడప జైలు గెస్ట్ హౌస్ కు వచ్చి వెనుదిరిగి వెళ్లిపోయారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు వైఎస్ భాస్కర్‌రెడ్డి కడప జైలు గెస్ట్ హౌస్ కు వచ్చి వెనుదిరిగి వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. తనను మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వైఎస్ భాస్కర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కడప జైలు గెస్ట్ హౌస్ కు వచ్చిన భాస్కర్‌రెడ్డి అక్కడ సీబీఐ అధికారులు అందుబాటులో లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.
లెటరే కీలకం...
ఈ సందర్భంగా వైఎస్ భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను అరెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చని అన్నారు. తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోయినా విచారణకు పిలిస్తే వచ్చానని తెలిపారు. విచారణ సక్రమంగా జరగాలంటే వైఎస్ వివేకా హత్యకు సమీపంలో లభ్యమయిన లెటర్ ఆధారంగానే జరగాలన్నారు. ఏ దర్యాప్తు సంస్థకైనా విచారణకు లెటర్ ప్రధాన ఆధారమని వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.