Ys Jagan : ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త... ఇక ముందున్నవన్నీ మంచి రోజులే

వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో పదోన్నతులకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది

Update: 2023-11-23 11:19 GMT

వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో పదోన్నతులకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తమకు పదోన్నతులు కల్పించడం లేదన్న విమర్శలకు జగన్ సర్కార్ చెక్ పెట్టింది. దీనికి సంబంధించిన అర్హతలు, నిబంధనలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యార్హతలు ఏవంటే...?
జగన్ తన పాదయాత్రలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ పదోన్నతులకు ఆర్టీసీ ఉద్యోగులు గతంలో నిర్ణయించిన ప్రకారరం దూరమయ్యారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఆర్టీసీ సంఘాలు తీసుకెళ్లాయి. దీనిపై కసరత్తులు చేసిన ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత విద్యార్హతల ప్రకారమే పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది.


Tags:    

Similar News