YS Jagan: లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు
వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మార్చి 30న కురుబ లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు. ఈ దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఇది టీడీపీ నేతల హత్య అని వైసీపీ ఆరోపిస్తూ ఉంది.
వైఎస్ జగన్ మంగళవారం నాడు బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి చేరుకోనున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ సోమవారం పరిశీలించారు. అయితే టీడీపీ మాత్రం ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ అంటూ ఆరోపిస్తోంది.