జగన్ పార్టీకి షాకిచ్చిన కూటమి సర్కార్

వైఎస్ జగన్ పార్టీకి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. పీఏసీ చైర్మన్ గా జనసేనకు అవకాశమిచ్చింది

Update: 2024-11-21 11:44 GMT

వైఎస్ జగన్ పార్టీకి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. పీఏసీ చైర్మన్ గా జనసేనకు అవకాశమిచ్చింది. సహజంగా ప్రతిపక్ష పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి ఇస్తారు. కానీ వైసీపీ శాసనసభలో తగినంత బలం లేకపోవడంతో ఆ పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వలేదు. పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలంటే కనీనం పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండాల్సి ఉందని చెబుతున్నారు.

పులవర్తి ఆంజనేయులుకు...
ఈరోజు పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే పీఏసీ ఛైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన నుంచి పీఏసీ ఛైర్మన్ గా పులవర్తి ఆంజనేయులను నియమించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసకున్నారు. దీంతో పీఏసీ ఛైర్మన్ పదవి కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షమన జనసేనకు దక్కింది.


Tags:    

Similar News