వైసీపీ ఫీజు పోరు వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఆందోళనను వాయిదా వేసింది;

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఆందోళనను వాయిదా వేసింది. ఈ నెల 5వ తేదీన ఫీజు రీఎంబర్స్ మెంట్ పై పోరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులకు వెంటనే వాటిని విడుదల చేయాలంటూ పోరు చేయాలని భావించింది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాయిదా వేసింది.
ఈ నెల 12వ తేదీకి...
ఎన్నికల సంఘానికి తమ ఆందోళనకు అనుమతివ్వాలిన కోరినా ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ ఆందోళనను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. మేరకు వైసీపీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. మార్చి 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఆందోళనలకు దిగాలంటూ తమ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది.