అలా అయితే రాజీనామా చేస్తా

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు;

Update: 2022-09-28 06:33 GMT
అలా అయితే రాజీనామా చేస్తా
  • whatsapp icon

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని సవాలవం విసిరారు. రైల్వేజోన్ విశాఖకు రావడం లేదన్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. విశాఖ రైల్వేజోన్ అంశం రాష్ట్ర విభజన అంశంలో ఉందని ఆయన తెలిపారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయాన్ని రాజ్యసభలో స్పష్టం చేసిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

ఆ అంశమే...
విశాఖ రైల్వ జోన్ పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశం చివరి దశలో ఉందని ఆయన తెలిపారు. నిన్నటి ఏపీ, తెలంగాణ అధికారుల సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని ఆయన తెలిపారు. కేవలం రైల్వేలైన్ మాత్రమే చర్చకు వచ్చిందని ఆయన అన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం ఉన్నందున మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని అన్నారు.


Tags:    

Similar News