YSRCP : నేటి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర

నేటి నుంచి వైసీపీ నేతలు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తొలి విడతలో 39 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర సాగనుంది.

Update: 2023-10-26 03:12 GMT

నేటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తొలి విడతలో 39 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర సాగనుంది. గత యాభై రెండు నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలసి ఈ బస్సు యాత్రలో పాల్గొనాలని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు ఈ యాత్రలో పాల్గొనాలని జగన్ నిర్దేశించారు.

ఇచ్ఛాపురం నుంచి...
ఈ మేరకు ఈరోజు తొలి సారి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించనున్నారు. అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాలను అందిస్తున్న వైనాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి ఇంటి ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన విధానాన్ని, విద్య, వైద్య రంగంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులను, ఫ్యామిలీ డాక్టర్ వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ బస్సు యాత్రను ప్లాన్ చేశారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాలకు తగ్గకుండా బస్సు యాత్ర ఉండేలా ప్లాన్ చేశారు.


Tags:    

Similar News