Jagan In Delhi: ఢిల్లీలో జగన్ కు వారు హ్యాండ్ ఇచ్చారా?

ఆంధ్రప్రదేశ్‌‌లో శాంతిభద్రతలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Update: 2024-07-24 05:54 GMT

ఆంధ్రప్రదేశ్‌‌లో శాంతిభద్రతలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వల్ప వ్యవధిలోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్నారు. అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం జగన్‌తో ఢిల్లీ వెళ్లకుండా శాసనమండలికి హాజరు అయ్యారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. ఈ విషయం దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి వైఎస్ జగన్ ధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ దారుణకాండపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు.


Tags:    

Similar News