సమయం దగ్గర పడుతోంది మిత్రమా.. నిర్లక్ష్యం చేస్తే భారీ నష్టమే..

సమయం దగ్గర పపడుతోంది మిత్రమా.. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పడాల్సిందే. మరి ఆ ఇబ్బందులు ఏమిటి అనుకుంటున్నారా..? అదేనండి ..

Update: 2023-09-02 04:09 GMT

సమయం దగ్గర పపడుతోంది మిత్రమా.. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పడాల్సిందే. మరి ఆ ఇబ్బందులు ఏమిటి అనుకుంటున్నారా..? అదేనండి 2000 రూపాయల నోట్ల సంగతి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గతంలో 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. మరి జనాల దగ్గర ఉన్న ఆ పెద్ద నోట్లను బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలని సూచించింది. ఇక రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. అయితే ఆ నోట్లను మార్చుకునేందుకు గడువు సెప్టెంబర్‌ 30. ఈలోగా మీ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవడం లేదా, ఖాతాలో డిపాజిట్ చేయడం చేయాలి. గడువు ముగిసిన తర్వాత మీ వద్ద ఆ నోట్ల మిగిలిపోయినట్లయితే వృధా అయిపోతాయి. తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందస్తు జాగ్రత్త పడి రూ.2000 రూపాయల నోట్లను మార్చుకోవడం బెటర్‌.

బ్యాంకులకు 93 శాతం వచ్చేశాయి..

ఇక ఇప్పటి వరకకు 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు 93 శాతం వరకు వచ్చినట్లు ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల నుంచి అందిన డేటా ప్రకారం.. ఆగస్టు 31, 2023 వరకు చెలామణి నుంచి తిరిగి పొందిన రూ. 2000 నోట్ల మొత్తం విలువ 3.32 లక్షల కోట్ల రూపాయలు అని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఆగస్టు 31, 2023న బ్యాంకు లావాదేవిలు ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. 2000 రూపాయలు డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మార్చి 31, 2023న 3.62 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఆర్బీఐ తెలిపింది. మే 19వ తేదీన బ్యాంకింగ్‌ సమయం ముగిసే వరకు 3.56 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిందని తెలిపింది.

అధిక విలువ కలిగిన 2000 రూపాయల నోటు సెప్టెంబరు 30, 2023 వరకు డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మిగిలిన కాలాన్ని ఉపయోగించుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభ్యర్థించింది. అయితే ఈ 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే ఐడీ ఫ్రూప్‌ గానీ, ఇతర స్లిప్‌లు అవసరం లేదని తెలిపింది. బ్యాంకు ఖాతా లేని వారు కూడా సమీపంలో ఉన్న ఏదైనా బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని, ఇందుకు ఎలాంటి ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఒక వ్యక్తి రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఓకేసారి రూ.20 వేల వరకు పరిమితి ఉందని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈనెలలో బ్యాంకులకు మొత్తం 16 రోజుల పాటు సెలవులు వచ్చాయి. అందుకే గడువు తీరకముందే బ్యాంకులకు వెళ్లి మీ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవడం ఉత్తమం.



Tags:    

Similar News