మరో 4 రోజుల తర్వాత ఇక్కడ రూ. 2000 నోట్లు చెల్లవు
ఇక 2000 రూపాయల నోట్ల కథ ముగియనుంది. ఈ సెప్టెంబర్ నెలతో ఈ పెద్ద నోట్లు కనుమరుగు కానున్నాయి. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇక 2000 రూపాయల నోట్ల కథ ముగియనుంది. ఈ సెప్టెంబర్ నెలతో ఈ పెద్ద నోట్లు కనుమరుగు కానున్నాయి. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రజల వద్ద ఉన్ననోట్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఈ 2000 రూపాయల నోట్లు పెద్ద ఎత్తున బ్యాంకులు వచ్చి చేరుతున్నాయి. నోట్లను మార్చుకోవడం,లేదా అకౌంట్లో వేసుకోవడం లాంటి చేస్తున్నారు ప్రజలు. అయితే ఈ రూ.2000నోట్లను మార్పిడికి సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చింది ఆర్బీఐ. ఈ విషయం అటుంచితే ఇక ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 19వ తేదీ వరకు మాత్రమే తాము క్యాష్‌ఆన్ డెలివరీపై రూ.2000 నోట్లను మాత్రమే తీసుకుంటాము. 19వ తేదీ తర్వాత ఆ నోట్లను తీసుకోబోమని స్పష్టం చేసింది.