భారీగా పెరిగిన ధరలు
దసరా పండగ దగ్గర పడుతున్న సమయంలో బంగారం ధరలు మరింత పెరిగాయి
దసరా పండగ దగ్గర పడుతున్న సమయంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. అయితే పండగ కోసం ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. గతం కన్నా ఊపందుకున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకుల ప్రకారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయని నిపుణులు చెబుతున్నప్పటికీ, గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దసరా పండగకు కొనుగోలు చేద్దామనుకునే వారికి మాత్రం నిజంగా ఇది షాకింగ్ లాంటి వార్తేనని చెప్పాలి.
తగ్గిన వెండి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 270 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,760 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర మాత్రం 74,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.