మీరు యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారా? ఇవి గుర్తించుకోండి

దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీ రావడంతో లావాదేవీలు..

Update: 2023-08-18 06:06 GMT

దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీ రావడంతో లావాదేవీలు అన్ని కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దీంతో మోసాలు జరిగేందుకు అవకాశం ఎక్కువైపోయింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)అనేది నేటి కాలంలో డిజిటల్ చెల్లింపుల అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతిగా మారింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేస్తున్నారు.

యూపీఐ ఫ్రాడ్ నివారణ చిట్కాలు:

యూపీఐ కస్టమర్ల వేగంగా సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన మోసాల కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో యూపీఐ లావాదేవీలను నియంత్రించే సంస్థ ఎన్‌పీసీఐ యూపీఐ మోసాన్ని నిరోధించడానికి కొన్ని సులభమైన భద్రతా చర్యల గురించి సమాచారాన్ని అందించింది. ఏదేనా లావాదేవీలను యూపీఐ ద్వారా చేసేటప్పుడు మీ లావాదేవీలకు ఎలాంటి మోసం జరుగకుంఆడ ఉండేందుకు కొన్ని చిట్కాలను పాటించడం ఉత్తమం. వీటి ద్వారా మీ అకౌంట్‌ సురక్షితంగా ఉంచుకుననేందుకు దోహదపడుతుంది. ఎన్‌పీసీఐ వివరాల ప్రకారం.. యూపీఐ వినియోగదారులు డబ్బును స్వీకరించడానికి పీన్‌ని నమోదు చేయవలసిన అవసరం లేదు. అయితే డబ్బును బదిలీ చేయడానికి మాత్రం తప్పకుండా పిన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

అకౌంట్‌కు డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ముందు, డబ్బును స్వీకరించే వ్యక్తి యూపీఐ ఐడీని క్రాస్ చెక్ చేయండి. ఎలాంటి ధృవీకరణ లేకుండా లావాదేవీలు జరవద్దు. లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. అన్నివివరాలు సరైనవిగా భావించిన తర్వాతే చెల్లింపులు చేయండి. మీ యాప్ పిన్ పేజీలో మాత్రమే యూపీఐ పిన్‌ని నమోదు చేయండి. దీనితో పాటు మీ యూపీఐ పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు.

క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌:

డబ్బులు చెల్లింపులు చేసేందుకు మాత్రమే QR కోడ్ స్కాన్ చేయబడిందని గుర్తుంచుకోండి. డబ్బులు స్వీకరించేందుకు మాత్రం మీకు ఎలాంటి క్యూఆర్‌ కోడ్‌ అవసరం లేదు. మీ మొబైల్‌లో ఎలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. ఇలా చేసినట్లయితే మీరు సైబర్‌ నేరాల బారిన పడే ప్రమాదం ఉంది. వారు మీ వ్యక్తిగత పూర్తి సమాచారం తస్కరించే ప్రమాదం ఉంది. అందుకే మీ లావాదేవీలు జరిపే ముందు అన్ని జాగ్రత్తలు పదేపదే తీసుకోవడం ఉత్తమమని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News