Gold Price Today : పసిడిని పట్టుకుంటేనే షాకిస్తుందిగా.. అలా ఉన్నాయి ధరలు బాసూ
బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.;

బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కొంత కాలం తగ్గినట్లే కనిపించిన బంగారం ధరలు తాజాగా వరసగా ధరలు పెరుగుతుండటం ఆవేదన కలిగిస్తుంది. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా గగనమై పోతుంది. నెలకు ఒక్క గ్రాము కొని పొదుపు చేసుకునే వారు ఇటీవల కాలంలో అనేక మంది ఉన్నారు. ఇటువంటి వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. కానీ గ్రాము బంగారం ధర కూడా భారీగా పెరగడంతో అటువైపు చూడటానికే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. వెండి ధరలు కూడా ఆకాశన్నంటుతుండటం కొనుగోలు దారులను మరింత నిరాశకు గురి చేస్తుంది.
వచ్చే ఏడాదికి లక్షకు చేరువలో...
బంగారం పది గ్రాముల ధర ఇప్పటికే ఎనభై వేలు దాటింది. కిలో వెండి ధర లక్ష రూపాయలను క్రాస్ చేసింది. ఇక బిజినెస్ నిపుణులు చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాదికి తులం బంగారం లక్ష రూపాయలు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్న మాటలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేసేవారి పై ఇది మరింత భారం పడుతుంది. దీంతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే తమ ఆర్థిక స్థోమత సరిపోదని భావించే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అన్ని ధరలు పెరుగుతుండటంతో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోవడంతో ఇక బంగారం ఎక్కడ కొనుగోలు చేయాల్రా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ధరలు పెరిగి...
ప్రధానంగా బంగారం, వెండి ధరల పెరుగుదలను చూసి షాకయ్యేది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు మాత్రమే. సంపన్నులకు ఎంత పెరిగినా ఒకటే. కానీ ఈ రెండు వర్గాల వారికీ బంగారం, వెండి వస్తువులు దూరంగానే ఉంటున్నాయి. ఎక్కువ మంది కొనుగోలు చేసేది ఈ వర్గాలకు చెందిన వారే కావడంతో ఈ ప్రభావం కొనుగోళ్లపై పడుతుంది. తాజాగా దేశంలో నేడు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,910 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,630 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర, 1,03,000 రూపాయలకు చేరుకుంది.