Oil Prices: గుడ్‌న్యూస్‌ చెప్పనున్న కేంద్రం.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు

Oil Prices: వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు మోడీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం;

Update: 2024-01-25 08:30 GMT
Cooking Oil

Cooking Oil

  • whatsapp icon

Oil Prices: వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు మోడీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంట నూనె ధరలను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే ఆయిల్‌ ధరలను తగ్గించగా, ఇప్పుడు మరింత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఆయిల్‌ ధరలను తగ్గిస్తే వంటగది బడ్జెట్‌లో ఊరట లభించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ కంపెనీలకు లేఖ రాసింది. ప్రపంచ ధరల ఆధారంగా ఎడిబుల్ ఆయిల్ ధరను తగ్గించాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం వంటనూనె ధరలో భారీ తగ్గింపు సాధ్యం కాకపోయినా దశల వారీగా కొంత తగ్గింపును అమలు చేసే అవకాశం ఉంది. అయితే మార్చి నెల వరకు ఎడిబుల్ ఆయిల్ ధర తగ్గే అవకాశం ఉంది. ఇక భారత్‌లో ఆవాల ఉత్పత్తిని చేపట్టనున్నారు. ఆ తర్వాత కొత్త నూనెను మార్కెట్‌కు సరఫరా చేస్తారు. అప్పటి వరకు ధర తగ్గించే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే, దీని గురించి ఎటువంటి సమాచారం రాలేదు.

గత కొద్ది రోజులుగా ఎడిబుల్ ఆయిల్ ధరలను పెంచకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంతకుముందు బల్క్ పామాయిల్ దిగుమతులు, దిగుమతి సుంకాన్ని తగ్గించింది కేంద్రం. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకంటే ముందుగానే వంటనూనె ధరలు తగ్గించే ఆలోచనలో ఉంది కేంద్రం.

Tags:    

Similar News