IT Returns: అలర్ట్.. ఐటీఆర్ డెడ్‌లైన్ మిస్సయ్యారా? పెనాల్టీ తప్పదు
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 మదింపు సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 మదింపు సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31తోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే అప్పటిలోగా రిటర్న్స్ దాఖలు చాలా మంది ఇంకా చేయలేరు. అందుకు రకరకాల కారణాలు ఉన్నాయ.. సమయంలోగా చేయకుంటే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే దాఖలు చేయనివారు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చివరి గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. ఈ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనిని ఆలస్య రుసుముల కింద పరిగణించి ఫైన్ విధింది ఇన్‌కమ్ ట్యాక్స్. దీనినే బిలేటెడ్ ఐటీఆర్ అని అంటారు. ఆదాయపు పన్ను శాఖ టాక్స్ చట్టంలోని 234-F కింద ఈ ఆలస్య ఫైన్ చెల్లించి దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది.
గడువు డిసెంబర్ 31, 2023లోగా ఐటీఆర్ దాఖలు చేయకుంటే, అధిక మొత్తంలో పెనాల్టీ, ఫీజు, వడ్డీ తదితరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్ దాఖలుకు జూలై 31తో గడువు ముగియగా, దానిని డిసెంబర్ 31 వరకు రిటర్న్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు.
గడువు దాటితే 5,000 జరిమానా
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, ఐటీఆర్ చేయని వారరు గడువులోగా రిటర్న్‌లు దాఖలు చేయకపోతే ఆలస్యమైన దాఖలుకు 5 వేల రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే జరిమానా మొత్తం రూ.1,000. మిగిలిన వారు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.