బంగారం ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు దేశీయ మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం
బంగారం ధరలు దేశీయ మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 57,590 మార్కు వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 62,830 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,740 పలుకుతుండగా.. 24 క్యారెట్స్ బంగారం రేటు రూ. 62,990 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ 58,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 63,440 కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 57,590 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 62,830 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 57,590 గా, 24 క్యారెట్ల బంగారం ధర 62,830 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 57,590 గా, 24 క్యారెట్ల బంగారం ధర 62,830 గా ఉంది.
వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీపై రూ. 300 పెరగ్గా ఇప్పుడు రూ. 75,700 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సిల్వర్ ధర రూ. 300 పెరిగింది. కేజీ రూ. 74,200 కు చేరింది.