Gold Prices: బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

శనివారం నాడు దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర

Update: 2024-01-06 03:29 GMT

gold and silver prices

Gold Prices: శనివారం నాడు దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గడంతో ధర రూ. 58,000కి చేరింది. 1 గ్రామ్​ 22క్యారెట్ల బంగారం​ ధర ప్రస్తుతం 5,800గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గి.. రూ. 63,270కి చేరింది. శుక్రవారం నాడు ఈ ధర రూ. 63,380గా ఉండేది. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,270గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,400గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,270గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,400గా ఉంది. బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,930గా ఉంది. పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 58000గా, 24 క్యారెట్ల పసిడి రూ. 63,270గానూ నమోదైంది.
దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రూ. 76,600గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. కోల్​కతాలో కిలో వెండి 76,600 రూపాయలు ఉండగా.. బెంగళూరులో రూ. 74,000గా కొనసాగుతూ ఉంది.


Tags:    

Similar News