Gold Price: వామ్మో.. బంగారం ధర ఇంత పెరిగిందా? రికార్డు స్థాయిలో నమోదు

దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ తాజాగా భారీగా పెరుగుదల నమోదైంది. మన భారతీయ

Update: 2024-09-13 16:13 GMT

Gold Price

దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ తాజాగా భారీగా పెరుగుదల నమోదైంది. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యలలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. అయితే కేంద్ర బడ్జెట్‌కు ముందు భారీగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పతనం అయ్యాయి. అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా అంటే సెప్టెంబర్‌ 13వ తేదీన రాత్రి తులం బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1200 రూపాయలు పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1300 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,450 వద్ద నమోదైంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,450 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,450 వద్ద ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,600 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,450 వద్ద ఉంది.

ఇక కిలో వెండి ధరపై కూడా భారీగానే పెరిగింది. కిలోపై ఏకంగా రూ.3000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.89,500 వద్ద కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు సెప్టెంబర్‌ 13న రాత్రి 9 గంటలకు నమోదైనవి మాత్రమే.

Tags:    

Similar News