ఈరోజైనా బంగారం కొనొచ్చా?

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్ళిపోయిన బంగారం ధరలు కాస్త తగ్గాయి

Update: 2024-07-09 02:24 GMT

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్ళిపోయిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. దాదాపు 10 రోజుల తర్వాత పసిడి ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,440గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,570గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు 10 రోజుల తర్వాత తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 200 మేర దిగివచ్చి రూ. 67,440 కు చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ.220 మేర తగ్గింది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,440గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,570గా కొనసాగుతూ ఉంది. విజయవాడలో కూడా అదే రేట్లు ఉన్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 67,590 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,720గా ఉంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,570గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 67,990గా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 74,170గా ఉంది.
ప్రస్తుతం కేజీ వెండి రూ. 95,100గా ఉంది. హైదరాబాద్లో కేజీ వెండి రూ. 99,600గా ఉంది. విజయవాడ కేజీ వెండి రూ. 99,600గా నమోదైంది.


Tags:    

Similar News