Gold price : ధరలు ఇంత పెరిగాయంటే.. రానున్న రోజుల్లో...?
బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. అనేక కారణాలతో ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి
బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. అనేక కారణాలతో ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. దసరా పండగకు పసిడి కొనుగోలు చేద్దామని భావించిన వారికి షాక్ తగలుతుంది. పండగ ముందు కొన్ని రోజుల పాటు ధరలు దిగి వచ్చి కొద్దిగా ఊరించాయి. దీంతో మరింత ధరలు తగ్గే అవకాశముందని కొనుగోలుదారులు వెయిట్ చేశారు. అయితే ఇప్పుడు గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు తీస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్...
ఇప్పుడే ఇలా ఉంటే రానున్నది పెళ్లళ్ల సీజన్. మరింతగా ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలతో కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా కొనుగోలు చేయడం కష్టంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇలా....
ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరింత పరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పరుగులు తీస్తుంది. కిలో వెండి ధరపై పన్నెండు వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56.600 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,750 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండడి ధర 75,300 రూపాయలకు చేరుకుంది.