Gold Rates Today : ఈరోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. ధర ఎంతంటే?

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి.

Update: 2024-09-02 03:30 GMT

పసిడి అంటే అందరికీ మక్కువే. అయితే దానిని కొనుగోలు చేయాలంటే మాత్రం సామాన్యుల స్థోమత సరిపోదు. అలా ధరలు భారీగా పెరిగాయి. పదేళ్ల నాటికి ఇప్పటికీ వేల రూపాయలు తేడా బంగారం ధరల్లో ఉంది. అయితే రూపాయి విలువ కూడా కొద్దిగా తగ్గడంతో పాటు, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, వేతనాలు పెరగడంతో కొందరు అవసరమైనప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు జ్యుయలరీ కలెక్షన్ ను హాబీగా పెట్టుకుని డబ్బులు వెచ్చించి వివిధ రకాల ఆభరణాలను ఇంటికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఫంక్షన్లలో బంగారం ఒంటినిండా దిగేసుకుపోయినా ఇంట్లో ఉండటం క్షేమకరమని అందరూ భావిస్తున్నారు.

తక్కువ వడ్డీకి...
అందుకే బంగారానికి డిమాండ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. పైగా బంగారం అంటే భద్రత అనే ముద్ర పడిపోయింది. క్లిష్ట సమయాల్లో అండగా ఉండేది పుత్తడి మాత్రమే. వెంటనే తమ అవసరాలకు డబ్బులను తెచ్చుకోవచ్చు. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణాలను తీసుకుని తిరిగి చెల్లించిన తర్వాత ఇంటికి తెచ్చుకునే వీలు ఒక్క బంగారానికి మాత్రమే ఉంది. అందుకే బంగారాన్ని ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం అక్టోబర్ వరకూ మంచి ముహూర్తాలు లేకపోయినా పసిడి కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. కాకుంటే భారీ వర్షాల కారణంగా గత మూడు రోజుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి.
తగ్గిన ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. నిజంగా బంగారాన్ని కొనుగోలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ధరలు పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,940 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,030 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 91,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News