పసిడి పైపైకి... రీజన్ ఇదే

పసిడి ధరలు తగ్గుతుండటంతో సంతోషపడిన కొనుగోలుదారులకు క్రమంగా నాలుగు రోజుల నుంచి పెరుగుతున్నాయి

Update: 2023-10-11 02:59 GMT

పసిడి ధరలు తగ్గుతుండటంతో సంతోషపడిన కొనుగోలుదారులకు క్రమంగా నాలుగు రోజుల నుంచి పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా అంటున్నారు.

ఐదో రోజు కూడా..
తాజాగా ఐదో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెెట్ల పది గ్రాముల బంగారం ధర 53,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,530 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర మాత్రం ప్రస్తుతం 75,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News