Gold Prices : పెళ్లిళ్లు మొదలయ్యాయి కదా... ఇక పరుగును ఆపలేమేమో
బంగారం ధరలు భారీగా పెరిగాయి. వినియోగదారులకు షాకిచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగింది
పెళ్లిళ్ల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కొన్ని లక్షల పెళ్లిళ్లు తెలుగు రాష్ట్రాల్లో మొదలు కానున్నాయి. దీంతో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. పసిడి ధరలను ఆపే శక్తి ఎవరికీ లేదు. అలా పెరుగుతూనే వెళుతుంటాయి. దక్షిణ భారత దేశంలో బంగారం అంటేనే మక్కువ. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇటీవల కాలంలో ఆషాఢమాసంలోనూ పసిడిని కొనుగోలు చేస్తూ తమకు బంగారాన్ని సొంతం చేసుకోవడమే ముఖ్యమని భావించే వాళ్లు ఎక్కువగా కనపడుతున్నారు.
ధరలు పెరుగుతున్నా....
పెరుగుతున్న బంగారం ధరలు చూసి నోరెళ్ల పెట్టే వారు చాలా మంది ఉన్నారు. కానీ అవసరాలు, సందర్భాలను బట్టి కొనుగోలు చేయకతప్పడం లేదు. వివాహాది శుభకార్యాలయాల్లో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో పాటు జ్యుయలరీ దుకాణాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లతో ముందుకు వస్తుండటంతో వాటిని సొంతం చేసుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తుంటారు. అందుకోసమే సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో మామూలు అయిపోయింది.
ఈరోజు ధరలు...
తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వినియోగదారులకు షాకిచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా దాని సరసన చేరింది. కిలో వెండి ధర పై కూడా నాలుగు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,850 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,020 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 79,400 వద్ద ట్రెండ్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెప్పాయి.