ఉలిక్కిపడిన పసిడిప్రియులు
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల ఎనభై రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి
బంగారం ధరలు ఐదు రోజుల పాటు పెరిగి ఒకరోజు స్వల్పంగా తగ్గి కొంత ఊరట కలిగించాయి. గత ఐదు రోజుల నుంచి పుత్తడి ధరలు పెరుగుతుండం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఒక రోజు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరగడంతో పసిడి ప్రియులు ఉలిక్కిపడ్డారు. ఇక బంగారం ధరలు తగ్గవేమోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనాలు వినపడుతున్నాయి.
ఈరోజు రేట్లు ఇలా...
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల ఎనభై రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,910 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 75,500 రూపాయలకు చేరుకుంది.