Gold Rates Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగన బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అత్యధికంగా పెరిగాయి.
పసిడి కొనుగోళ్ల సీజన్ ప్రారంభమయింది. పెళ్లిళ్లు సీజన్ ఇంకా మొదలు కాకముందే కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. భవిష‌్యత్ లో ధరలు పెరుగుతాయని భావించి ముందుగానే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీంతో జ్యుయలరీ దుకాణాలన్నీ వినియోగదారులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. దీపావళి పండగ, ధన్ తెరాస్, తర్వాత పెళ్లిళ్ల సీజన్, మంచి ముహూర్తాలు రెండు నెలల పాటు వ్యాపారులకు ఇక పండగే. కానీ వినియోగదారులకు మాత్రం బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి.
సులువుగా విక్రయించేందుకు...
బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. ఈ రెండు వస్తువులు ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయాయి. ఆభరణాలను గానే చూడకుండా మదుపు చేసేందుకు కూడా బంగారం కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకోవడంతో డిమాండ్ ఎప్పుడూ వీటికి తగ్గదు. అవసరమైనప్పుడు సులువుగా విక్రయించుకునే వస్తువు కావడం, ఎలాంటి పత్రాలు లేకుండా అమ్మకాలు జరుపుకోవచ్చన్న నమ్మకంతో ఎక్కువ మంది బంగారం, వెండి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అందుకే అన్ సీజన్ లోనూ ధరలు పెరుగుతాయి. ఇక సీజన్ వస్తుందంటే ధరలను ఆపడం ఎవరి తరమూ కాదన్నది అందరికీ తెలిసిందే.
భారీగా పెరిగి...
కానీ బంగారం ధరలు ఎంత పెరిగినప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. వాటిని కొనుగోలు చేయడం మామూలయింది. ధరలను చూసి కాసేపు బాధపడటం, తర్వాత కొనుగోలు చేయడం హాబీగా మారింది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అత్యధికంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల అరవై రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై గత రెండు రోజుల్లో రెండు వందలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,410 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,900 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరల 1,02,800 రూపాయలుకు చేరుకుంది.