Gold Rate: బంగారం ధర ఎందుకు పెరుగుతోంది..? దిగే అవకాశాలు లేవా?

బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ప్రకారం.. బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ

Update: 2024-03-06 13:53 GMT

Gold Rate

బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ప్రకారం.. బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు.. ఆర్థిక అనిశ్చితి కొనసాగడం.. ఇలా అనేక కారణాలు చెబుతారు. దీనికి తోడు భౌగోళిక, రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరలను శాసిస్తాయి. సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడి వైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి. క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నాయి.

ఇది కూడా బంగారం ధర పెరగడానికి మరో కారణం. అయితే ప్రస్తుతం అంటే మార్చి 6న రాత్రి 7 గంటల సమయానికి బంగారం ధరను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి రూ.59,700 ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. రూ.280 పెరిగి. 65,130 ఉంది. ఇక కిలో వెండి రూ.74,500 వద్ద కొనసాగుతోంది.

పెళ్లిళ్ల సీజన్‌లో..

ఇదిలా ఉండగా, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే బంగారంపై పెట్టుబడి అనేది ప్రస్తుతం రోజుల్లో ఒక సెంటిమెంట్‌గా మారిందనే చెప్పాలి. గతంలో బంగారంపై పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈనెలాఖరు వరకు పెళ్లిళ్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏప్రిల్‌ నెలలో ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడు లు మందగించినా.. ఆ తర్వాత పుంజుకుంటాయనేది ఒక అంచనా ఉంది. అందుకే బంగారం ధరలకు చెక్‌ పెట్టడం కొంత కష్టమైన పనేనని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News