Gold Price Today : ఇంకా బంగారం ధరలు తగ్గాలి సామీ.. అప్పుడే కొనాలని వెయిట్ చేస్తున్నారట

దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

Update: 2025-04-24 03:32 GMT

బంగారం ధరలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ప్రజల కొనుగోలు శక్తితో సంబంధం లేకుండా వాటంతట అవి పెరుగుతూ పోతుంటాయి. అనేక పరిణామాలతో ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. రోజుకు రెండు సార్లు ధరల్లో మార్పులు, చేర్పులు జరగుతుండటంతో బంగారం, వెండి ధరలు నిలకడగా ఎప్పుడూ కొనసాగవు. అదే సమయంలో ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయలేక బంగారం, వెండి విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అరవై శాతం అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం దుకాణాలు నిర్వహించడం కష్టమేనని అంటున్నారు.

ఈగలు తోలుకుంటున్నారు...
ఇప్పటికే కార్పొరేట్ జ్యుయలరీ దుకాణాలు నిర్వహణ విషయంలో చాలా వరకూ జాగ్రత్తలు పాటిస్తున్నాయి. సిబ్బందిని కుదించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకుని పొదుపు వైపు పరుగు తీస్తున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్, అక్షర తృతీయ వంటివి ఉన్నప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. దీనికి ధరల భారమే కారణమని చెప్పాలి. అందుకే దాదాపుగా అన్ని జ్యుయలరీ దుకాణాల వారు బేరాలు లేక ఈగలు తోలుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత విధించిన సుంకాలు, తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ధరలు పెరిగాయని, మరొక వైపు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా ఈ ధరలపై పనిచేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు తగ్గినా..
బంగారం ఈ రేంజ్ లో పెరిగితే ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రారని వ్యాపారులు డీలా పడ్డారు. పసిడి ధరలు మరింత పెరగడమే కాని తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. కానీ దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు జరిగే అవకాశముంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,150 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,350 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర మాత్రం 1,11,000 రూపాయలకు చేరుకుంది


Tags:    

Similar News