చవితి రోజు పసిడి ధరలు ఇలా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే పెరిగింది;
బంగారం కొనుగోలు చేయాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. నచ్చిన డిజైన్ల కోసం ఒకవైపు అందుకు తగిన సొమ్ము మరొక వైపు. ఈ రెండు లభించి పసిడి కొనుగోలు చేయాలంటే దాని ధర అందనంత దూరం వెళ్లిపోతుంది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితికి బంగారం, వెండి ధరలు చేరాయంటే అతిశయోక్తి కాదు. అలాగని బంగారం కొనుగోళ్లు కూడా తగ్గాయని చెప్పలేని పరిస్థితి.
సొంతం చేసుకోవడానికి...
భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని, వెండిని సొంతం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఇక వివాహాది శుభకార్యాలతో పాటు పుట్టిన రోజునాడు కూడా గోల్డ్ సంబంధిత వస్తువును బహుమతిగా ఇచ్చుకునే సంప్రదాయం ఉండటంతో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. దిగుమతులు అంతగా లేకపోవడం, కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం ఇక్కడ అలవాటు లేకపోవడం కూడా ఇందుకు కారణం.
పెద్దగా పెరగకున్నా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే పెరిగింది. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,910 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,900 రూపాయలకు చేరుకుంది. వెండి ధర మాత్రం నిలకడగానే ఉంది. కిలో వెండి ధర 78,200 రూపాయలుగా నమోదయి ఉంది.