Gold Price Today : బంగారాన్ని ఇక కొనలేమోమో.. ధరలు ఇంక పెరగడమే తప్ప?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి

Update: 2024-08-14 03:48 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ముందుగా అంచనా వేసిందే. సీజన్ ప్రారంభం కావడంతో ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. అనుకుంటున్నట్లుగానే ధరలు పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం, వెండి వస్తువుల కొనుగోళ్లు ఎక్కువ అయింది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు ముందు నుంచి చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగని కొనుగోలు కోసం వెయిట్ చేస్తే ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.

సీజన్ కావడంతో...
శ్రావణమాసం ప్రారంభం కావడం, ఈ నెలలోనే పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం, మహిళలు అత్యంత ఇష్టపడే వరలక్ష్మి వ్రతం వంటివి ఉండటంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మహిళలు అత్యంత ఇష్టపడే ఈ పండగల కోసం ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే జ్యుయలరీ దుకాణాలు కూడా పెద్దయెత్తున ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. దీంతో పాటు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల స్కీమ్ లను జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం అందుబాటులోకి తెచ్చింది. వరసగా నాలుగు నెలల పాటు బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,660 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,630 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 83,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. ఇది ఉదయం ఆరు గంటలకు ఉన్న ధరలు మాత్రమే. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరగవచ్చు. తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News