Gold Price Today : లక్షదాటడానికి బంగారానికి ఇంకా ఎన్నో రోజులు పట్టేట్లు లేదుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.;

Update: 2025-03-29 02:32 GMT
gold rates today in hyderabad,  silver , increase, india
  • whatsapp icon

బంగారం ధరలు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఒక రోజూ కూడా బ్రేక్ ఇవ్వకుండా అలుపు లేకుండా పరుగు తీస్తూనే ఉన్నాయి. ఎందుకో ఏమో కారణాలు అనేకం కనిపిస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం ఇప్పుడు ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాయని చెప్పక తప్పదు. బంగారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. మొన్నటి వరకూ కష్టమైనా కొనుగోలు చేద్దామనుకునే వారు. నేడు ఇష్టమున్నా కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం ధరలు పెరగడమే. ఇందుకు అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధం, ట్రంప్ అధ్యక్షుడు వంటి కారణాలు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మంచి ముహూర్తాలుండటంతో...
ఇక పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లకు పెద్దయెత్తున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లోనూ జ్యుయలరీ దుకాణాలు వెలవెల పోతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తులం బంగారం 90 వేలు దాటేసింది. కిలో వెండి లక్ష పది వేల రూపాయలు దాటింది. విదేశాల నుంచి పెద్దయెత్తున బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అలాంటిది విదేశాల నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఎన్ని ఆఫర్లు పెట్టినా, ఎన్ని రాయితీలు ప్రకటించినా ధరలను చూసి బెంబెలెత్తిపోయిన జనం బంగారం వైపు చూడటానికే భయపడిపోతున్నారు.
భారీగా పెరిగి...
బంగారం అంటే ఒకప్పుడు భారంగా ఉండేది కాదు. ధరలు అందరికీ అందుబాటులో ఉండేవి. ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నప్పటికీ బంగారం కొనుగోళ్లపై దాని ప్రభావం పడేది కాదు. కానీ నేడు కొనుగోలు శక్తి పెరిగినా బంగారంపై అంత డబ్బు వెచ్చించడం అనవసరమన్న భావన పెరిగిపోయింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పదకొండు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై మూడు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 83,410 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,990 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,14, 100 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News