Gold Price Today : ఉగాది పండగ రోజు కూడా పెరిగిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.;

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది జరగదు. తగ్గుదల అనేది ఒక్క బంగారం విషయంలోనే మనం చూడం. ఎందుకంటే ప్రపంచంలోనే బంగారానికి ఉండే డిమాండ్ ఏ వస్తువుకు లేదు. భూమి తర్వాత అత్యంత గిరాకీ ఉన్నది ఏదైనా ఉందంటే అది బంగారమేనని చెప్పుకోవాలి. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎప్పుడూ ప్రజలు ఉత్సాహ పడుతుంటారు. తహతహలాడుతుంటారు. తాము కొద్దికొద్దిగా దాచిపెట్టుకున్న డబ్బులతో కొనుగోలు చేయాలనుకునేది తొలుత బంగారం, వెండి వస్తువులనే. అవే మన జీవితానికి కష్టసమయాల్లో ఆసరాగా నిలుస్తాయని భావించడం మొదలయిన తర్వాత వీటి కొనుగోళ్లు ఎక్కువయినట్లు ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
భారతీయ సంప్రదాయంలో...
ఇక భారతీయ సంప్రదాయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు, పుట్టిన రోజులు ఇలా ఇంట్లో ఏద రకమైన కార్యక్రమం జరిగినా అందులో బంగారం, వెండికి చోటు ఉండాల్సిందే. బంగారానికి అలాంటి ప్రాధాన్యత ఉంది. అందులోనూ ఇండియాలో ఎక్కువ వినియోగం కనిపిస్తుంది. దిగుమతుల్లోనూ భారత్ అన్ని దేశాలకంటే ముందుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం నిల్వలు ఎక్కువగా భారత్ కే దిగుమతి అవుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే గత కొంతకాలంగా దిగుమతులు తగ్గడంతో ధరలు ప్రారంభమవ్వడం ప్రారంభమయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వీటికి తోడు సీజన్ కూడా వచ్చి పడటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయంటున్నారు.
నేడు ధరలు...
ఇప్పటికే బంగారం ధర 92 వేల రూపాయలు దాటేసింది. అంటే రికార్డు బ్రేక్ చేసేసింది. లక్ష రూపాయలకు చేరుకునే దూరం ఎంతో సమయం పట్టదు. వెండి కూడా దాదాపు అంతే స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ రెండు వస్తువుల ధరలు భారీగా పెరగడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 84,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,400 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,03,950 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.