Gold Price Today : షాకిచ్చిన గోల్డ్ ...ఒక్కరోజులోనే బంగారం ధర ఇంత పెరిగిందా? ఇక కొనడం కష్టమేనా?

బంగారం ధరలు మరింత భారం కానున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత పెరుగుతాయన్న వ్యాపారుల అంచనాలు నిజమవుతున్నట్లే కనిపిస్తుంది

Update: 2024-12-12 03:14 GMT

బంగారం ధరలు మరింత భారం కానున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత పెరుగుతాయన్న వ్యాపారుల అంచనాలు నిజమవుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మరోసారి చాలా రోజుల తర్వాత పది గ్రాముల బంగారం ధర 80 వేలకు చేరడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అటు బంగారం, ఇటు వెండి ధరలు పెరుగుతుండటంతో ఇక వాటిని కొనుగోలు చేయడం కష్టంగానే కనిపిస్తుంది. తిరిగి మునుపటి ధరలకు చేరుకున్నాయి. అలాగే వచ్చే కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.



అనేక కారణాలతో...

అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, బంగారం నిల్వలు, యుద్ధాలు వంటి కారణాలలతో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు కొత్త ఏడాది వస్తుండటంతో కొనుగోళ్లు కూడా పెరుగుతుంటాయి. అదే సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోలు చేయడానికి ఈ ఏడాది చివరి నెల కావడంతో ఉత్సాహం చూపుతారని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. సురక్షితమైన పెట్టుబడి కావడంతో కొంత వెయిట్ చేస్తే ధరలు మరింత పెరుగుతాయని ఇప్పుడే సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. కొత్త ఏడాది కొత్త డిజైన్లతో జ్యుయలరీ దుకాణాలు కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
భారీగా పెరిగిన ధరలు...
దీంతో పాటు అనేక ఆఫర్లతో కూడా కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు జ్యుయలరీ దుకాణాలు గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి మరింత ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా అంతే స్థాయిలో పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 600 రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై 1500 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,240 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,170 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 95,900 రూపాయలుగా నమోదయింది.




Tags:    

Similar News