Gold Prices : పెళ్లిళ్ల సీజన్‌లో ఆ మాత్రం ధరలు ఉంటే చాలు కదా?

బంగారం ఎప్పడూ వినియోగదారులను ఊరిస్తూనే ఉంటుంది. సహజంగా శుభకార్యాల సమయంలో పసిడిని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది

Update: 2023-11-13 02:58 GMT

బంగారం ఎప్పడూ వినియోగదారులను ఊరిస్తూనే ఉంటుంది. సహజంగా శుభకార్యాల సమయంలో పసిడిని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే నేటి రోజుల్లో అలా కాదు. ఎప్పుడు డబ్బులు తమ వద్ద ఉంటే అప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాలని భావించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. భూమితో పాటు బంగారం కూడా పెట్టుబడి వస్తువుగా మారింది. ఎప్పటికైనా ధర పెరిగే వస్తువు కావడంతో దీనిపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

సీజన్ తో సంబంధం లేకుండా...
అందువల్లనే సీజన్ తో నిమిత్తం లేకుండా బంగారం కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. ధరలు ఎక్కువగా అనిపించినప్పుడు మాత్రం కొనుగోళ్లు తగ్గడం, ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెరగడం ఇందులో భాగమే నంటున్నారు వ్యాపారులు. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్వల్పంగా తగ్గిన...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. వెండి ధరలు మాత్రం నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. అందుకే పెద్దగా ధరలు తగ్గకపోయినా వినియోగదారులకు ఇది ఊరట కలిగించే అంశమే. పెళ్లిళ్ల సీజన్ లో ధరలు తగ్గడం అంటే సంతోషమే కదా? హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,540 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 60,590 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 76,000 నిలకడగా కొనసాగుతుంది.


Tags:    

Similar News