Car Sales : కారు కొనాలనుకుంటున్నారా? గుడ్ న్యూస్.. ఇదే సరైన సమయం... కావాల్సినంత రాయితీ

కార్లు కొనేవారికి గుడ్ న్యూస్. అతి ఖరీదైన కార్లు తక్కువ ధరలకే వస్తున్నాయి. కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటి్తున్నాయి.

Update: 2024-08-24 06:42 GMT

కార్లు కొనేవారికి గుడ్ న్యూస్. అతి ఖరీదైన కార్లు తక్కువ ధరలకే వస్తున్నాయి. అవీ పాత కార్లు కాదండోయ్.. కొత్త కార్లు.. కంపెనీ షోరూంలు పిచ్చ పిచ్చగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అనేక రాయితీలతో దాదాపు రెండు లక్షల వరకూ ఒక్కో కారు మీద రాయితీ ఉందంటే గతంలో ఎప్పుడూ లేనంత కార్ల ధరలు తగ్గాయనే చెప్పాలి. కార్లు కొనాలంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే కొత్త కారు షోరూం నుంచి కొనుగోలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. దీనికి కారణం అన్ని కార్ల కంపెనీల ధరలు తగ్గించాయి.

ఏ మోడల్ అయినా...
కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ల కంపెనీలు దీపావళి, దసరా లేదా డిసెంబరు నెలాఖరకు పండగ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఎందుకంటే డిసెంబరు ఆ ఏడాది గడువు ముగుస్తుండటంతో కారు మోడల్ మారుతుందని భావించి కొంత రాయితీని ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. అది ఎప్పుడూ ఉండేదే. డిసెంబరు నెలలో అన్ని కంపెనీలు ఈ ఆఫర్లు ఎక్కువగా ప్రకటించడానికి ఇదే కారణం. తమ వద్ద ఉన్న పాత స్టాక్ ను వదిలించుకోవడానికి ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తాయి. బీమా సౌకర్యం కూడా ఉచితమే.
భారీగా రాయితీలు...
కానీ ఇప్పుడు మాత్రం కార్ల ధరలపై భారీగా రాయితీలు ప్రకటించాయి. మారుతి, హ్యుందాయ్, మహేంద్ర కంపెనీ, టాటా మోటార్స్, హోండా వంటి కార్లపై భారీ రాయితీలు లభిస్తున్నాయి. ఎంత వరకూ అంటే ఒక్కో కారు మీద రెండు లక్షల వరకూ ఆఫర్లున్నాయి. అదీ ఇప్పుడు కొంటేనే. పాత కారు ఇస్తే ఇక ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు. డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. బ్యాంక్ లోన్ కూడా వాళ్లే ఇప్పిస్తున్నారు. ఇక కారులో ఇంటీరియర్స్ కూడా కొన్ని కంపెనీలు ఫ్రీ అంటూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం తమ వద్ద ఉన్న పాత స్టాక్ ను వదిలించుకోవడం కోసమేనని చెబుతున్నారు.
73 వేల కోట్ల విలువైన...
అయితే దీని సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ విక్రయం కాని కార్లు ఏడు లక్షలకుపైగా ఉన్నాయట. డీలర్ల వద్ద అలాగే పడి ఉన్నాయి. వీటి విలు 73 వేల కోట్ల రూపాయలు అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ వెల్లడించడం విశేషం. ఈ ఏడాది కార్ల అమ్మకాలు పూర్తిగా తగ్గాయి. ఎవరూ కార్లు కొనుగోలు చేేసేందుకు ముందుకు రాకపోవడంతో భారీగా స్టాక్ మిగిలిపోయింది. దీంతో ఇటువంటి రాయితీలను ప్రకటిస్తున్నాయి. హై ఎండ్ కార్లపై కూడా గతంలో ఇలాంటి ఆఫర్లు ఎప్పుడూ లభించలేదు.


Tags:    

Similar News