ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
వాహనాలు నడపాలంటే ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీవో..
వాహనాలు నడపాలంటే ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ రోజులు మారిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. సులభమైన మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. తరువాత లైసెన్స్ పొందవచ్చు. లైసెన్స్ కోసం కార్యాలయానికి వెళ్లకుండా మీరు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, మీరు ముందుగా లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ వాహన లైసెన్సింగ్ నిబంధనలు. ఈ లెర్నింగ్‌కు కొంత గడువు ఉంటుంది. నెల తర్వాత ఆర్టీసీ కార్యాలయానికి టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.