Google: గూగూల్‌ కొత్త ఫీచర్‌.. ఇలా చేస్తే టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు

Toll Tax: జాతీయ రహదారులపై కారులో ప్రయాణించేటప్పుడు టోల్‌ ప్లాజా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైవేపై..

Update: 2024-01-16 11:02 GMT

Google

Toll Tax: జాతీయ రహదారులపై కారులో ప్రయాణించేటప్పుడు టోల్‌ ప్లాజా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైవేపై వెళ్తుంటే చాలా ప్రాంతాల్లో ఈ టోల్‌గేట్లు ఉంటున్నాయి. ఒక్కోసారి టోల్‌ట్యాక్స్‌ చెల్లించకుండా తప్పించుకోవాలని చూసినా కుదరని పరిస్ధితి ఉంటుంది. మీరు టోల్‌ ట్యాక్స్‌ చెల్లించకుండా తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అందుకు గూగుల్‌ (Google) సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. మరి ఫీచర్‌ ఏంటి? టోల్‌ చెల్లించకుండా తప్పించుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

టోల్‌ ట్యాక్స్‌ను నివారించేందుకు గూగుల్‌ మ్యాప్స్‌లో ప్రత్యేక ఫీచర్‌ ఉంది. మీరు Google మ్యాప్స్ ద్వారా లొకేషన్‌ను చేరుకోవడానికి మార్గం కోసం సెర్చ్‌ చేయండి. అప్పుడు మీకు లోకేషన్‌ మార్గం చూపిస్తుంది. మీరు వెళ్లే దారిలో ఎక్కడెక్కడ టోల్‌ గేట్లు ఉన్నాయో ఆ వివరాలు చూపిస్తుంది. అయితే మీరు టోల్‌ నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గాలను కూడా ఎంచుకోవచ్చు. అయితే అందుకు కొన్ని ఆప్షన్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

➦ ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Google మ్యాప్స్ యాప్‌ను తెరవండి.

➦ మీరు వెళ్లాలనుకుంటున్న స్థలం, చిరునామా లేదా పేరును నమోదు చేయండి.

➦ తర్వాత డైరెక్షన్‌పై క్లిక్‌ చేయండి

➦ ఇప్పుడు మీరు మీ స్థానాన్ని ఎంచుకోవాలి.

➦ ఎగువన ఉన్న రవాణా ఆప్షన్‌ను ఎంచుకోండి. ఉదాహరణకు కారు

➦ ప్రక్కన ఉన్న మూడు చుక్కల మెనుని నొక్కండి.

➦ దీని తర్వాత టోల్‌లను నివారించే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

➦ ఇప్పుడు టోల్‌ప్లాజా లేని మార్గం కనిపిస్తుంది.

టోల్ ప్లాజాలు లేని మార్గాలను Google Maps మీకు చూపుతుంది. అయితే కొన్ని రూట్లలో టోల్ ట్యాక్స్‌ను ఆదా చేయడానికి మీరు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు షార్ట్‌కట్‌ రూట్లు ఉంటాయి. ఆ దారి గుండా వెళితే సమయం, దూరం కూడా తగ్గవచ్చు. 

Tags:    

Similar News