కొంచెం రిలీఫ్...అయినా?
బంగారం ధరలు కొనుగోలు చేసే వారికి కొంత ఊరట అనే చెప్పాలి. ఈరోజు ధరలు పెరగలేదు. స్థిరంగానే కొనసాగుతున్నాయి
బంగారం ధరలు కొనుగోలు చేసే వారికి కొంత ఊరట అనే చెప్పాలి. ఈరోజు ధరలు పెరగలేదు. స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా వరసగా ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. శుభకార్యాలు త్వరలో ఉండటం, పండగల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇలా...
అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,410 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,450 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం 77,000 రూపాయలుగా ఉంది.