ఎల్‌ఐసీలో సూపర్‌ స్కీమ్‌.. రూ.29 పెట్టుబడితో రూ.4 లక్షల బెనిఫిట్‌

LIC Scheme: దేశంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వినియోగదారుల కోసం ఎన్నో అద్భుతమైన స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది.

Update: 2023-11-07 03:30 GMT

LIC Scheme: దేశంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వినియోగదారుల కోసం ఎన్నో అద్భుతమైన స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. హెల్త్‌ పాలసీతో పాటు మంచి రాబడి అందించే స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. తక్కువ డిపాజిట్‌తో ఎక్కువ బెనిఫిట్‌ అందించే పథకాలను ప్రవేశపెడుతోంది. జీవిత బీమాతో పాటు సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది. మహిళల కోసం కూడా పలు రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ పథకాల్లో ఎల్‌ఐసీ ఆధార్ శిలా యోజన ఒకటి. ఈ పథకం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎల్‌ఐసీ ఆధార్ శిలా యోజన అనేది సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్, ఇది హామీతో కూడిన రాబడి, జీవిత బీమా రెండింటినీ అందించే స్కీమ్‌. ఆధార్‌ కార్డు ద్వారా ఈ స్కీమ్‌ను ఓపెన్‌ చేయవచ్చు.

ఈ పథకంలో చేరిన మహిళలు రోజువారీ, నెల, ఆరు నెలలు, సంవత్సరం ప్రతిపాదికన నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కనిష్టంగా రూ.75,000, గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయం 10 సంవత్సరాలు. అయితే గరిష్టంగా 20 ఏళ్ల వరకు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎంచుకున్న వ్యవధి ముగింపులో పథకం చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన మొత్తాన్ని, బోనస్‌ను తిరిగి చెల్లిస్తుంది. బోనస్ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తారు.

ఎంత బెనిఫిట్‌ పొందవచ్చు

మీకు 30 ఏళ్లు ఉండి 20 ఏళ్ల పాటు రోజుకు 29 రూపాయల చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తే ఈ పథకం టెన్యూర్‌లో మొత్తం రూ.2,11,170 చెల్లించాల్సి వస్తుంది. అయితే, 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.4 లక్షలు లభిస్తాయి. అటే ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి రూ.1.88 లక్షల లాభాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఇందులో ఎవరెవరు చేరవచచ్చు

8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు మధ్యలో మహిళలు ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. 70 ఏళ్ల వరకు ఈ స్కీమ్‌లో కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఎల్‌ఐసీ ఆధార్ శిలా యోజనలో చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే LIC బ్రాంచ్ సందర్శించవచ్చు లేదా సమీపంలోని ఏదైనా LIC ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. 

Tags:    

Similar News