ఎల్‌ఐసీ పాలసీదారులకు అద్భుతమైన అవకాశం

దేశంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(LIC) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారుల కోసం ప్రత్యేక..

Update: 2023-10-21 11:43 GMT

దేశంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(LIC) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారుల కోసం ప్రత్యేక బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే ఎల్‌ఐసీకి కోట్లాది మంది పాలసీదారులున్నారు. అయితే ఎవరివన్న పాలసీ రద్దు అయినట్లయితే అలాంటి వారికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రద్దు అయిన పాలసీలను తిరిగి పునరుద్దరించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందు కోసం ఎల్‌ఐసీ ప్రత్యేక ప్రచారాన్ని (ఎల్‌ఐసీ పాలసీ రివైవల్ క్యాంపెయిన్) ప్రారంభించింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ల్యాప్స్‌ అయిన పాలసీని పునరుద్దరించుకునేందుకు ఇందులో అవకాశం కల్పిస్తోంది.

ల్యాప్స్‌ పాలసీ అంటే ఏమిటి?

చాలా మంది పాలసీ తీసుకున్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్లనో, మరేదైన కారణంగానే ప్రీమియం చెల్లించడం నిలిపివేస్తారు. దీని కారణంగా కొన్ని నెలల తర్వాత పాలసీ రద్దు అవుతుంటుంది. అంటే వారి పాలసీ పని చేయకుండా పోతుంది. అలాంటి వారికి ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది ఎల్‌ఐసీ. ఇప్పుడు రద్దు అయిన పాలసీని పెనాల్టీ ఛార్జీలు చెల్లించి పునరుద్దరించుకోవచ్చు.

ఎల్‌ఐసీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ట్వీట్‌ను పంచుకుంటూ ఎల్‌ఐసీ ప్రత్యేక పునరుద్ధరణ ప్రచారాన్ని ప్రారంభించిందని పేర్కొంది. దీని ద్వారా అక్టోబర్‌ 31 వరకు ల్యాప్స్ అయిన పాలసీని తిరిగి యాక్టివేట్ చేయడం ద్వారా కస్టమర్‌లు భారీ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందవచ్చు. రూ.1 లక్ష ప్రీమియంపై ఆలస్య రుసుములలో 30 శాతం తగ్గింపు, అంటే గరిష్టంగా రూ.3,000. 1 లక్ష నుండి 3 లక్షల మధ్య, 30% తగ్గింపు లభిస్తుంది. అంటే గరిష్టంగా రూ. 3500, 3 లక్షల కంటే ఎక్కువ, 30 శాతం తగ్గింపు అంటే రూ. 4000 వరకు తగ్గింపులో పాలసీని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. మీ పాలసీని పునరుద్దరించాలనుకుంటే ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ licindia.in ద్వారా గానీ, లేదా మీ సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయం, లేదా ఏజంటును సంప్రదించి పునరుద్దరించుకోవచ్చు.



Tags:    

Similar News