Gold Price Today : బంగారం ధరలు ఇంతగా పెరిగాయే... ఒక్కసారిగా ఇంత పెరిగిందా?
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందు నుంచే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.;

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందు నుంచే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో ముందుగానే కొనుగోలు చేయడం మంచిదని గత రెండు రోజుల నుంచి వ్యాపారులు కూడా సూచిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచే బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడూ తగ్గినట్లు కనిపించినా కేవలం పది గ్రాముల ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గి నిరాశ పర్చింది. కానీ పెరిగినప్పుడు మాత్రం ధరలు భారీగా పెరుగుతుండటంతో బంగారం ధర ఎనభై రెండు వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర మాత్రం లక్షకు దగ్గరలోనే ఉంది.
మోజు ఎక్కువ కావడంతో...
బంగారం అంటేనే అందరికీ మోజు ఎక్కువ. దానిని సొంతం చేసుకోవడానికి ఎక్కువ మంది మహిళలు ఇష్టపడుతుంటారు. ప్రతి నెలా పొదుపు చేసి మరీ బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయడం చాలా మంది అలవాటు చేసుకున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు అవసరమైన వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. కొనుగోళ్లు పెరుగుతాయి. తద్వారా డిమాండ్ మరింత పెరుగుతుంది. అదే సమయంలో ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేయడానికి తమ సంస్కృతులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఈ సీజన్ లో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. ఇక బంగారం ధరలను అదుపు చేయడం కష్టమేనని అంటున్నారు.
నేటి ధరలు ఇవీ...
దేశంలో బంగారం, వెండి వస్తువులకు ఉన్న విలువ ఎప్పటికీ తగ్గదు. దానికి ఉన్న ట్రెండ్ కూడా పడిపోదు. రోజురరోజుకూ పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గని వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం కొంత తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,180 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 93,820 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి.