Good News: గర్భిణుల కోసం మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు, అలాగే వివిధ వర్గాల ..
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు, అలాగే వివిధ వర్గాల నుంచి గర్భిణుల వరకు అన్ని రకాల పథకాలను అందిస్తోంది. ఈ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది మోడీ ప్రభుత్వం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ఆర్థిక సహాయం అందించేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన ఒకటి. ఇది గర్భిణుల కోసం రూపొందించిన పథకం. ఈ స్కీమ్‌లో ప్రభుత్వం మహిళలకు రూ.6 వేలు అందిస్తోంది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళల ఖాతాలోకి వస్తుంది. దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సమస్యను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం మాతృత్వ వందన యోజనను ప్రారంభించింది. ప్రసవానికి ముందు, తర్వాత గర్భిణులు తమ బిడ్డల సంరక్షణకు, రోగాల బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన జనవరి 1, 2017న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీలందరూ ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత గర్భిణులకు ఏక మొత్తంలో రూ.6,000 అందదు. గర్భిణులకు ప్రభుత్వం మూడు విడతలుగా రూ.6000 అందజేస్తుంది. ఈ మొత్తం నేరుగా గర్భిని బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
దరఖాస్తు చేయడం ఎలా?
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే గర్భిణీ స్త్రీల వయస్సు 19 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. మీరు ఈ పథకాన్ని పొందాలనుకుంటే, మీరు ఈ పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojanaని సందర్శించవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్ నుండి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, దరఖాస్తును పూరించి సంబంధిత కార్యాలయంలో సమర్పించవచ్చు. అంగన్‌వాడీలో లేదా హెల్ప్‌లైన్ నంబర్ 7998799804కు కాల్ చేయడం ద్వారా మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది.
అవసరమైన పత్రాలు:
తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రం,బ్యాంక్ ఖాతా పాస్ బుక్ అవసరం. మూడు విడతల్లో నిధులు వస్తాయి.