వాహనదారులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. దాదాపు 20 నెలలుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. దాదాపు 20 నెలలుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ధరలు తగ్గించే దిశగా కేంద్రం కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ET Now నివేదిక ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఆలోచనలు చేస్తోంది మోడీ సర్కార్. 2022లో లీటరు పెట్రోల్‌పై రూ. 17, డీజిల్‌పై రూ. 35 నష్టపోయిన OMCలు ఇప్పుడు లీటరు పెట్రోల్‌పై రూ. 8-10, డీజిల్‌పై రూ. 3-4 లాభాన్ని ఆర్జిస్తున్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది. ముడి చమురు, రిటైల్ ధరలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటికే OMC తో చర్చించినట్లు తెలుస్తోంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఇప్పుడు లాభాలను ఆర్జిస్తున్నందున, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దిశగా చర్చలు జరుపుతోంది. గత మూడు త్రైమాసికాల్లో బలమైన లాభాల కారణంగా OMC మొత్తం నష్టాలు తగ్గాయి. గత త్రైమాసికంలో మూడు OMCలు – IOC, HPCL, BPCL – ఉమ్మడి లాభం రూ. 28,000 వేల కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. OMCల అండర్ రికవరీ ముగిసినందున, దాని ప్రయోజనాన్ని వినియోగదారులకు కూడా పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ముడి చమురు ధరలు ఎంతగా మారాయి?
ముడి చమురు ధరల గురించి మాట్లాడినట్లయితే, ఇది చాలా కాలంగా బ్యారెల్కు $ 80 కంటే తక్కువగా ఉంది. గత నెల రోజులుగా, గల్ఫ్ దేశాల సగటు చమురు బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువగా ఉంది. అమెరికా చమురు ధరలు ఒక నెల పాటు బ్యారెల్‌కు సగటు ధర $ 75 కంటే తక్కువగా ఉన్నాయి. గల్ఫ్ దేశాల చమురు సోమవారం బ్యారెల్‌కు 75.99 డాలర్ల కంటే తక్కువగా ఉంది. అమెరికా చమురు ధర బ్యారెల్‌కు 71.34 డాలర్లుగా ట్రేడవుతోంది.
ప్రస్తుతం ఢిల్లీలో లీట్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, కోల్‌కతాలో రూ.106.03 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 ఉండగా, చెన్నైలో రూ.102.63 ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, విజయవాడలో రూ.111.76.
డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62 ఉండగా, కోల్‌కతాలో రూ.92.76 ఉంది. ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.94.27 ఉండగా, చెన్నైలో రూ.94.24 ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.97.82 ఉండగా, విజయాడలో రూ.99.51 వద్ద ఉంది.