ఇలా తగ్గుతాయని అనుకోలేదే

తాజాగా బంగారం, వెండి ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి

Update: 2023-10-04 03:07 GMT

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకుల మేరకు బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ ఏడాది అరవై ఐదు వేల మార్క్ దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది శుభపరిణామమే అయినా.. ఈ తగ్గుదల ఎక్కువకాలం ఉండదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

భారీగా తగ్గిన...
తాజాగా బంగారం, వెండి ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.660లు తగ్గింది. కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,380 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర భారీగా తగ్గి ప్రస్తుతం మార్కెట్ లో 73,500 రూపాయలుగా కొనసాగుతుంది. కొనుగోలుదారులు ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి


Tags:    

Similar News