రూ.2000 నోట్ల మార్పిడికి గడువు ముగిసినా మర్చుకోవచ్చు..ఎలాగంటే..

ఇక రూ.2000 నోట్ల కథ ముగిసినట్లే. అక్టోబర్‌ 7వ వరకు ఈ పెద్ద నోట్ల చెల్లుబాటు అయ్యే సమయం ముగిసిపోయింది. ఈ ఏడాది..

Update: 2023-10-08 13:58 GMT

ఇక రూ.2000 నోట్ల కథ ముగిసినట్లే. అక్టోబర్‌ 7వ వరకు ఈ పెద్ద నోట్ల చెల్లుబాటు అయ్యే సమయం ముగిసిపోయింది. ఈ ఏడాది మే 23వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్ల ఉపసంహరణను ప్రకటిస్తూ నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో వాడుకలో ఉన్న రూ.2000 నోట్లు బ్యాంకులకు వచ్చి చేరాయి. ఇక ఈ రూ.2000 నోట్ల చలామణికి అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ముగిసింది. అయినప్పటికీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో వెసులుబాటు కల్పించింది. ఆర్బీఐకి కొన్ని ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ఇంకా ఎవరి వద్దనైనా మిగిలి వున్న నోట్లను మార్చుకోవాలంటే ఈ ఆర్బీఐ ఇష్యూ కార్యాలయానికి వెళ్లి మార్చుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఈ అవకాశం ఎంతకాలం ఉంటుందో మాత్రం ఆర్బీఐ చెప్పలేదు. ఆర్బీఐ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ అవకాశం ఉంటుంది. గత వారం ఆర్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాలలో 2,000 రూపాయల నోట్ల మార్పిడికి అనుమతి ఉంది. మరి మన దేశంలో ఎక్కడెక్కడ ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయో చూద్దాం. అక్కడికి వెళ్లి సులభంగా మిగిలివున్న రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే నోట్లను మార్చుకోవాలంటే అందుకు ఐడీ రుజువును సమర్పించి మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిన కార్యాలయాలు:

1. హైదరాబాద్

2. అహ్మదాబాద్

3. ముంబై

4. చెన్నై

5. బెంగళూరు

6. నవీ ముంబై

7. భువనేశ్వర్

8. భోపాల్

9. లక్నో

10. చండీగఢ్

11. గౌహతి

12. జమ్మూ

13. జైపూర్

14. కాన్పూర్

15. కోల్‌కతా

16. నాగ్‌పూర్

17. న్యూఢిల్లీ

18. తిరువనంతపురం

19. పాట్నా

ఇక్కడ మీరు పైన జాబితా చేయబడిన నగరాల్లోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయా ల ఇష్యూ విభాగానికి వెళ్లి, మీ బ్యాంక్ ఖాతాలో రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా నోట్లను మార్చుకోవచ్చు. మీరు నోట్లను మార్చుకోవాలనుకుంటే సరైన ID రుజువును అందించాలి.

Tags:    

Similar News