మార్కెట్లో రూ.1000 నోట్లు మళ్లీ రానున్నారా? ఆర్బీఐ ఏం చెప్పిందంటే..

ఇక దేశంలో రూ.2000 నోట్ల సంగతి ముగిసినట్లే. నోట్ల మార్పిడికి గడువు కూడా ముగిసిపోయింది. అయితే అయితే..

Update: 2023-10-22 11:08 GMT

ఇక దేశంలో రూ.2000 నోట్ల సంగతి ముగిసినట్లే. నోట్ల మార్పిడికి గడువు కూడా ముగిసిపోయింది. అయితే అయితే ఇంకా జనాల వద్ద రూ.10 వేల కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు 87 శాతం రూ.2000 నోట్లు తిరిగి వచ్చాయని, గడువు ముగియడంతో చాలా మంది డివిజనల్ కార్యాలయంలో రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేశారు. ఇప్పటికీ మార్కెట్‌లో 10 వేల కోట్ల రూపాయల నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయని, అవి బ్యాంకులకు రావాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ రెండు వేల రూపాయల నోట్ల సంగతి అటుంచితే మార్కెట్లోకి మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు రానున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియి వివరణ ఇచ్చింది.

రూ.1000 నోటుపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ.1000 నోటును చలామణిలోకి తెచ్చే యోచన లేదని, ఈ నోట్లను ముద్రించే ఆలోచనలో కూడా లేదని స్పష్టం చేసింది. వార్తా సంస్థ ఏఎన్‌ఐ ప్రకారం.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుతం రూ.1000 నోట్లను ముద్రించలేదు.

ఇక దేశంలో 2000 రూపాయల విలువైన 10000 కోట్ల రూపాయల నోట్లు ఎక్కడున్నాయన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ నోట్లు మార్కెట్‌లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఈ నోట్లను ఎవరు ఉపయోగిస్తున్నారనేది మాత్రం వెల్లడి కాలేదు. చిల్లర వ్యాపారులు, దుకాణదారులు, సామాన్య పౌరులు ఈ నోట్లను మార్కెట్‌లో ఉపయోగించడం లేదు కాబట్టి, అసలు ఈ నోట్లను ఎవరు ఉపయోగిస్తున్నారు?

ఈ నోట్లు చలామణి నుండి ఉపసంహరణ:

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెబ్‌సైట్ ప్రకారం.. 500, 1000, 10000 రూపాయల నోట్లను మొదటిసారి జనవరి 1946లో రద్దు చేశారు. 1000, 5000, 10,000 రూపాయల నోట్లను 1954లో, మళ్లీ 1978 జనవరిలో రద్దు చేశారు. ఆ తర్వాత 8 నవంబర్ 2016న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు.

ఇక ఇప్పటి వరకకు 2000 నోట్లు మిగిలి ఉన్నవారికి రిజర్వ్‌ బ్యాంక్‌ మరో అవకాశం ఇచ్చింది. అంటే బ్యాంకుల్లో కాకుండా ఆర్‌బీఐకి చెందిన 19 కార్యాలయాలు దేశంలో ఉన్నాయి. వాటిలో ఈ నోట్లను మార్చుకునే వెలుసుబాటు ఇచ్చింది. తగిన పత్రాలు చూపించి నోట్లను డిపాజిట్‌ చేయడమో లేక మార్చుకోవడమే చేసుకోవచ్చు. బ్యాంకులు, వాటి శాఖల్లో డిపాజిట్ చేయడానికి గడువు ముగిసినప్పటికీ ఆర్బీఐ ఈ విధంగా అవకాశం ఇచ్చింది.



Tags:    

Similar News