శబరిమల ఆలయానికి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా? గత ఏడాది కంటే..
Sabarimala Revenue: కేరళలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వారు
Sabarimala Revenue: కేరళలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అయ్యప్ప మాల ధరిస్తుంటారు. మాల ధరించిన వారు తప్పకుండా శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే ప్రతి ఏడాది అయ్యప్పస్వామికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంటుంది. ఈ నేపథ్యంలో మండల పూజ వేళ శబరిమల అయప్ప స్వామి ఆలయానికి 241.71 కోట్ల ఆదాయం వచ్చింది. 41 రోజుల్లో ఆ ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించారు.
గత ఏడాది సీజన్‌తో పోలిస్తే ఈసారి 18.72 కోట్లు అధికంగా ఆదాయం సమకూరినట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించంది. గత ఏడాది 222.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. 39 రోజుల్లోనే ఆలయ ఆదాయం 200 కోట్లు దాటినట్లు తెలిపిన ఆయన.. వేలం ద్వారా 37.40 కోట్లు వచ్చినట్లు ఓ మీడియా సమావేశంలో ప్రశాంత్ తెలిపారు. కానుకల రూపంలో వచ్చిన నాణాలను, నీలక్కల్ వద్ద పార్కింగ్ ఫీజులను లెక్కిస్తే ఆ మొత్తం ఆదాయం మరింత పెరుగుతుందన్నారు.
ఇక నగదు కానుకల రూపంలో 63.89 కోట్లు రాగా, అరవన ప్రసాదం ద్వారా 96.32 కోట్లు, అప్పం స్వీటు ద్వారా 12.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. బుధవారం కూడా అధిక సంఖ్యలో అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. మూడు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15వ తేదీన జరిగే మకరవిలక్కు పండుగ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.