నేడు ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్న మల్హోత్రా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు;

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. శక్తికాంత దాస్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా నేడు బాధ్యతలను చేపట్టనున్నారు. రాజస్థాన్ క్యాడర్ కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ గా మూడేళ్ల పాటు వ్యవహరించనున్నారు.

ఆర్థిక వ్యవస్థనను...
సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత అన్ని విషయాలను పరిశీలించి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదో అదే చేస్తానని ఆయన తెలిపారు. మల్హోత్రాకు ఆర్థిక మరియు పన్నుల విషయంలో అనుభవం ఉండటంతో భారత్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.