Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్‌‌న్యూస్... ఇంత భారీగా తగ్గిందా?

ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండిధరలు కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో తగ్గాయి

Update: 2024-08-08 03:15 GMT

శ్రావణమాసం ఆరంభంలో పసిడిప్రియులకు ఊరట కల్గించే వార్త ఇది. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు తగ్గుతుండటం కొంత ఆశాజనకంగా ఉంది. కొనుగోలుకు ఇది అనుకూలమైన సమయంగా వినియోగదారులు భావించి జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. సాధారణంగా శ్రావణమాసంలో బంగారం ధరలకు రెక్కలు వస్తాయన్న అంచనాలు వినిపించాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి కొనుగోళ్లు పెరుగుతాయని, అందుకు అనుగుణంగా ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

ఆ ప్రభావమేనా?
కానీ మార్కెట్ నిపుణుల అంచనాలకు విరుద్ధంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం చాలా వరకూ రిలీఫ్ అని చెప్పాలి. ఇటీవల కేంద్రబడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పై ఆరు శాతం తగ్గించడంతో బంగారం ధరలు దిగివచ్చాయంటున్నారు. అయితే అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు కూడా బంగరం ధరలపై ప్రభావం చూపాయన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేలకు చేరుకుంటుందని, కిలో వెండి లక్ష దాటుతుందని భావిస్తున్న తరుణంలో వాటి ధరలు తగ్గుతుండటం పెళ్లిళ్ల సీజన్ లో మంచి వార్తగానే చూడాలి. జ్యుయలరీ దుకాణాలు కూడా వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.
ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండిధరలు కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 1210 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 3,800 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఇవి ఉదయం ఆరుగంటల వరకూ ఉన్న ధరలు మాత్రమే. ఇవి పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగానూ కొనసాగే వీలుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,260 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 86,900 రూపాయలకు చేరుకుంది.



Tags:    

Similar News