Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్... ఈరోజు కొంటేనే బెటర్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి

Update: 2024-08-27 03:28 GMT

బంగారం ధరలు మరింత ప్రియం కాకముందే కొనుగోలు చేయాలని చెబుతుంటారు. ఎందుకంటే వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశముంది. డిమాండ్ తగ్గడం అనేది ఎప్పుడూ ఉండకపోవడంతో ధరలు ఎప్పుడైనా పెరగొచ్చు. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తారు. మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే అంచనాలకు కూడా అందని విధంగా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ధరలు మరింత పెరిగే అవకాశముందంటున్నారు.

పదేళ్లతో పోలిస్తే...
సహజంగా బంగారాన్ని ఒకప్పుడు సంపన్నులే కొనుగోలు చేసేవారు. అంటే అవసరం ఉన్నా లేకపోయినా వారు తమకు ఇష్టమైన బంగారాన్ని కొత్త డిజైన్లను ఇష్టపడి ఇంటికి తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు అలా కాదు. దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజలతో పాటు అందరూ పసిడి, వెండిని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. అందుకే బంగారం ధరలు ఇంతగా పెరిగిపోతున్నాయి. పదేళ్ల క్రితం ఉన్న బంగారం ధరలకు ఇప్పటి ధరలతో పోలిస్తే అసలు మనసు కుదుటుగా ఉండదు. ఆ రేంజ్ లో ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా సామాన్యులకు అందనంత విధంగా ఎగబాకాయి. అయినా సరే కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.
కొద్దిగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,940 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,030 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 92,800 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News