Gold Price Today : మహిళలకు తీపి కబురు... ఆదివారం షాపింగ్ చేద్దాం రారండోయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.
పసిడి పరుగులు ఆపింది. కొనుగోళ్లు తగ్గడంతో ధరలు కొంత దిగి రావడం ప్రారంభించాయి. ధరలకు బ్రేకులు పడటంతో కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వరసగా మూడు నెలలు మంచి ముహూర్తాలు ఉండటంతో ఈ సీజన్ లో ధరలు మరింత పెరుగుతాయని అనేక మంది ఆందోళన చెందారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడయిన తర్వాత కొంత ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఊపందుకున్న కొనుగోళ్లు...
బంగారాన్ని గతంలో కంటే ఎక్కువగా కొనుగోలు చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పసిడి ధరలు పైపైకి చూస్తున్న సమయంలో జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా వెరైటీ ఆభరణాలను రూపొందించి షోరూంలలో సిద్ధం చేసి ఉంచాయి. అయితే థన్ తెరాస్, దీపావళి సమయంలో పెద్దగా కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే ధరలు వరసగా తగ్గుదల కనిపిస్తుండటంతో మళ్లీ మహిళలు షోరూంల బాట పడుతున్నారు. బంగారం కొనుగోలుకు కొంత రద్దీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు భారీగా తగ్గడంతో...
అయితే అంతకు ముందు ఉన్న స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య పెద్దగా కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండేవారు మాత్రమే షాపులకు వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై ఎనిమిది వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,750 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,360 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధరల 94,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.